రామాయంపేట మున్సిపల్ పరిధిలో త్రిముఖ రాజకీయ పార్టీల హోరాహోరీ ప్రచారం,,,,,

ఎనిమిదో వార్డులో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ప్రచారం,,,,

రెండో వార్డులో కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం,,,,

తొమ్మిదవ వార్డులో కొడపర్తి నరేందర్ ఆధ్వర్యంలో బిజెపి ఎన్నికల ప్రచారం….

నేనంటే నేనే అంటూ ప్రచారాలు ముమ్మరంగా సాగాయి….

రామాయంపేట (స్టూడియో టెన్ టీవీ ప్రతినిధి) మే11:- పార్లమెంటరీ సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో 13వ తేదీన మే నెలలో జరగనున్న ఎన్నికల సందర్భంగా నేటితో ప్రచారం ముగిసే తరుణంలో రాజకీయ పార్టీలు చావో రేవో తెలుసుకోవడానికి ముమ్మర ప్రచారానికి శ్రీకారం చుట్టాయి….మండలంలో పట్టణంలో ప్రధాన పార్టీలు తమ తమ కార్యకర్తలతో హోరుగా…. జోరుగా ప్రచారాలు కొనసాగాయి…..రామయంపేట మున్సిపల్ పరిధిలో మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సహకారంతో ఎనిమిదో వార్డులో ముమ్మర ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నదని ఆయన ప్రచారం నిర్వహిస్తూ టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పోటీ సభ్యుడు వెంకట్ రామ్ రెడ్డి ని గెలిపించాలని కోరాడు. రెండో వార్డ్ లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో రామాయంపేట మున్సిపల్ పరిధి మహిళా కాంగ్రెస్ నాయకురాలు పోచమ్మల అశ్విని, కాంగ్రెస్ నాయకుడు సురేష్ నాయక్ మొదలైనవారు ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మల అశ్విని మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గం కాంగ్రెస్ వారసత్వం కావస్తుందన్నారు. అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలవడం జరిగిందన్నారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉద్యమ నాయకురాలుగా సినీనటి విజయశాంతి మెదక్ నుంచి పోటీ చేసి ఎంపీగా వెళ్లడం జరిగిందన్నారు.అదేవిధంగా ముదిరాజు ముద్దుబిడ్డ నీలం మదు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు.గనుక అతన్ని బిసి సామాజిక వర్గం నుంచి గెలిపించి పంచితే బీసీలకు న్యాయం చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం లభిస్తుందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డితోపాటు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!