-శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, మే10, మహానంది:
ఫ్యాను గుర్తుకు ఓటేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మహానంది మండలంలోని గాజులపల్లె, బసాపురం ఆంజనేయపురం గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఈవీఎం నమూనాపై అవగాహన కల్పించి, వైసిపి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, ప్రజా సంక్షేమాలను రాజకీయ పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందించాల్సిన సామాజిక పింఛనును మూడు వేలకు పెంచి వారికి ఆర్థిక భరోసా కల్పించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒకానొకప్పుడు తమ కుటుంబాలలో వృద్ధులు ఉంటే చీదరించుకునే స్థాయి నుండి నేడు తమ కుటుంబంలో వృద్ధులు ఉంటే బాగుండు అనే స్థాయికి ప్రజల ఆలోచనలు మార్చిన ప్రభుత్వం వైసిపి అన్నారు. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి, ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేసిన ప్రభుత్వం వైసిపి అన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం కొనసాగాలంటే మరల వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, ప్రస్తుతం జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానంద రెడ్డి లను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు వడుగూరి రామకృష్ణుడు, వైసిపి కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.