ప్రజల పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తి,అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసే వ్యక్తి పులివర్తి నానికి ఒక్క అవకాశం ఇవ్వండి…..టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి వినుకొండ సుబ్రహ్మణ్యం
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ సూరినేనివారిపల్లి నాయి బ్రాహ్మణ కాలనీలో గురువారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి వినుకొండ సుబ్రహ్మణ్యం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.చంద్రగిరి నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని’ని మే 13న జరిగే ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ నాయకుడు కృష్ణయ్య,బీసీ నాయకులు కనకరాజు,టిజె ప్రవీణ్ కుమార్,రంజిత్,తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ టిడిపి రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ వినుకొండ సుబ్రహ్మణ్యం పాకాల టిడిపి కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పాలన మొట్టమొదట కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బీసీలను గుర్తించి వారికి రిజర్వేషన్ లు ప్రవేశపెట్టారని,బడుగు బలహీన వర్గాలకు రెండు రూపాయలకు బియ్యం,పేదలకు దుస్తులు,50 రూపాయలకే రైతులకు కరెంట్ చార్జీ ఉండే విధంగా అభివృద్ధి చేశారని అన్నారు.చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా కృషి చేశారని తెలిపారు.కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అంటే ఎంతో అభివృద్ధి చేస్తారని ఆశతో అత్యధిక సీట్లు వచ్చేలాగా ప్రజలు గెలిపించారన్నారు.ఈ ఐదేళ్ల పరిపాలన కాలంలో ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందిందో ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని పేర్కొన్నారు.చంద్రగిరి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే పులివర్తి నానిని అత్యధిక మెజారిటీతో గెలిపించి,నారా చంద్రబాబు నాయుడుకి బహుమతిగా ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కనకరాజు,టిజె ప్రవీణ్ కుమార్,రంజిత్,నాయి బ్రాహ్మణ నాయకుడు కృష్ణయ్య,తదితరులు పాల్గొన్నారు.