రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 9:- మెదక్ జిల్లా రామయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి గాలి దుమారంతో కూడిన భారీ వర్షం పడింది. తీవ్ర గాలి దుమారం వల్ల గ్రామానికి చెందిన ముచ్చర్ల బాలరాజు, మొగుళ్ల మల్లేశం లకు చెందిన ఇంటి పై కప్పు రేకులు ఎగిరిపోయి పక్కనే ఉన్న పంట పొలాల్లో పడ్డాయి. దీంతో వారింట్లో ఉన్న సామాన్లు మొత్తం తడిసిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు వెంకు గారి రాజిరెడ్డి బాధిత కుటుంబాలకు ఒక్కరికీ రు.5000 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి స్వామి, బండారి అర్జున్, పడమటి వేణు తదితరులు పాల్గొన్నారు.