పోస్టల్ బ్యాలెట్ వినియోగాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 10 వ తేదీ వరకు పొడిగింపు

Reporter -Silver Rajesh Medak.

తేది 8.5.2024.

పోస్టల్ బ్యాలెట్ వినియోగాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 10 వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.

ఈ నెల 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి ఉన్న తేదీని మే 10 వ తేదీ వరకు పొడిగిస్తూ ఎన్నికల సంగం బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ పొందిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ నియోగించుకోవాలని ఆయన సూచించారు.

జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయాల్లో రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బాలేట్ వినియోగానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆయా శాఖల పరిధిలో ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది తప్పని సరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించు కోవాలని అన్నారు.
అధికారులు సిబ్బంది పోస్టల్ బాలెట్ వినియోగంపై ఫోకస్ చేయాలని ఆయన పేర్కొన్నారు. విధుల నిర్వహణలో ఉల్లంఘన జరిగితే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, u/s 134 ప్రకారం క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పోస్టల్ బాలేట్ కేంద్రంలోని హెల్ప్ డెస్క్, విధులు నిర్వహించే సిబ్బంది ఎన్నికల సంగం ఉత్తర్వులు మేరకు యథా విధిగా విధులకు హాజరుకావాలని ఆయన స్పష్టం చేశారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!