నార్సింగి మండల కేంద్రంలో మూడో విడత సామాజిక కార్యక్రమం

నార్సింగి (స్టూడియో10 టీవీ విలేఖరి) మే 8:- మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రం లోని ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ చెన్నా రెడ్డి ఆధ్వర్యంలో మూడో విడత సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ విరోజా, డీవీఓ శ్రీహరి, అంబుడ్స్మెన్ ప్రభాకర్, హెచ్ఆర్ రాజేందర్ రెడ్డి, ఎసార్పీ జీవన్, ఎంపిడిఓ చెన్నా రెడ్డి లు మాట్లాడుతూ మండల పరిధిలోని తొమ్మిది గ్రామ పంచాయితీలకు సంబంధించి సోషల్ ఆడిట్ నిర్వహించామని పేర్కొన్నారు. ఈ ఆడిటింగ్ లో టెక్నికల్ తప్పిదాల వల్ల, లెక్కల తప్పిదాల వల్ల, రికార్డులు సమర్పించకపోవడం వల్ల 37వేల256 లు రికవరీలు, 38వేల జరిమానాలు ఉన్నాయని తెలిపారు. వీటికి సంబంధించి బాధ్యులు కు నోటీసులు జారీ చేస్తామని, ఒకవేళ వీటికి సంబంధించిన లెక్కల రుజువులు సమర్పిస్తే అట్టి మొత్తానికి మినహాయింపు ఉంటుందని, లేని యెడల జరిమానాలు ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీలకు అన్ని గ్రామ పంచాయితీలలో ఉపాధి హామీ కూలీలకు 100 పని దినాలు కల్పించి వలసలను నివారించే భాధ్యత అందరిదీ అని, ఇప్పటికీ వరకు అందరి సహాయ సహకారాలు లభించాయని, మున్ముందు కూడా ఇంకా బాగా చేయాలని విరోజా సంభందిత సిబ్బందికి తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో రైతుల వ్యక్తిగత పనులు కూడా చేయాలని, తద్వారా రైతులకు సహాయం చేసినట్లు అవుతుందని అన్నారు. వ్యక్తిగత పనుల గురించి వివరిస్తూ రైతుకు ఇంకుడు గుంత అవసరం ఉన్నా, భూమి చదును చేయాల్సి ఉన్నా, పండ్ల తోటలలో, కోళ్ల ఫరాలలో, పశువుల షెడ్ల లో ఉన్న పనులను చేయిస్తే కూలీలకు పనులు రైతులకు సహాయం, జీవ రాశులకు మేలు కలుగుతుందని వివరించారు. నర్సరీ, చెట్ల పెంపకం లో మండలానికి తెలంగాణ లో 6వ స్థానం రావడం అందరికీ గర్వ కారణం అని, సంబంధించిన అధికారులకు, మండల ప్రజలకు శుభా కాంక్షలు తెలిపారు. దాదాపు అన్ని పంచాయితీలలో వంద శాతం చెట్లను సరంక్షించడం జరుగుతుందని అన్నారు. నార్సింగి మండలానికి ఇతర మండలాల వారు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్పీ లు, ఇంఛార్జి ఏపీఓ రాజేశ్వర్, టెక్నికల్ అసిస్టెంట్ స్వామి, వివిధ గ్రామాల పంచాయితీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!