కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం పల్లె రాంచందర్ గౌడ్ మీడియా సమావేశం

రామాయంపేట (స్టూడియో 10టీవీ ప్రతినిధి) మే 8:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రాంచందర్ గౌడ్ స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడి బలహీనవర్గాల పార్టీ అని అన్నారు. అదే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి వరి అంటే ఉరి అని చెప్పిన కలెక్టర్ పేదల భూములను ప్రభుత్వానికి అప్పజెప్పిన నాయకుడు అన్నారు.అదే రీతిగా బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాకలోనే గెలవలేక పోయిన ఆయన మెదక్ నియోజకవర్గంలో ఎలా గెలుస్తారని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు పట్టణాలు అభివృద్ధి అవుతాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించి మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబిసి కన్వీనర్ విప్లవ్ కుమార్, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు జహీరోద్దీన్, కోనాపూర్ సొసైటీ డైరెక్టర్ మామిడి సిద్దారాములు, రైతు యువ నాయకులు సాకేత్ రెడ్డి పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!