-శ్రీశైలం దేవస్థానం మాజీ ధర్మకర్త, టిడిపి నేత.. రవి స్వామి
స్టూడియో 10 టీవీ న్యూస్, మే07, మహానంది:
తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని శ్రీశైలం దేవస్థానం మాజీ ధర్మకర్త, టిడిపి నేత రవి స్వామి పేర్కొన్నారు. మంగళవారం మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరిలను, సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. అనంతరం ఈవీఎం నమూనా పై అవగాహన కల్పించి .ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామని,రాష్ట్రంలో ఎక్కడ చూసినా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని,ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ కి ఓటు వేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో భూపని వెంకటేశ్వర్లు,మద్ది బజార్ , పుల్లయ్య, శంకర్, మీనిగా నాగరాజు, డి.రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.