Reporter -Silver Rajesh Medak.
Date-05/05/2024.
Medak జిల్లా.
మెదక్ బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి వెంకట్ రామా రెడ్డికి మద్దతుగా, మిర్దొడ్డిలో నిర్వహించిన రోడ్ షో లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
బిజెపి పదేళ్లు ప్రభుత్వంలో ఉండి చేసింది ఏం లేదు.
కేలండర్ కడుపు నింపుతుందా.
ఏం చేసింది బిజెపి ప్రభుత్వం
బీడీ కట్టల మీద పన్ను వేసింది.
కాంగ్రెస్ పుర్రె గుర్తు పెట్టింది.
కాంగ్రెస్ వచ్చాక మోటార్లు కాలుతున్నాయి.
ఎందుకు రైతు బందు పడటం లేదు.
ఎంపీగా వెంకట్ రామా రెడ్డిని గెలిపించాలని కోరుతున్నా.
ఎంపి అభ్యర్థి వెంకటరామరెడ్డి కామెంట్స్…
11 సంవత్సరాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో పీడీగా, జాయింట్ కలెక్టర్ గా, కలెక్టర్ గా వివిధ హోదాల్లో మీకు సేవ చేసే భాగ్యం కలిగింది.
మీ ఆదరణను, ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోలేను. మీ సేవకుడిగా, మీలో ఒకడిగా ఉండాలని మీ ఆశీర్వాదం కోరుతూ మెదక్ ఎంపీగా మీ ముందుకు వస్తున్నాను.
ఉమ్మడి మెదక్ ప్రజల రుణం తీర్చుకోవాలనే సదుద్దేశ్యంతో, నా ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి రూ. 100 కోట్లతో వెంకటరామ రెడ్డి ట్రస్టు ద్వారా సేవలందిస్తాను.
పేద పిల్లలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల శిక్షణ, యువతకు స్కిల్ డెవలప్మెంట్, మహిళా సాధికారత కోసం కార్యక్రమాలు నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
నిబద్ధత కలిగిన అధికారిగా, పేదలకు సేవ చేసిన వ్యక్తిగా ఉమ్మడి మెదక్ ప్రజలకు నా జీవితం తెరిచిన పుస్తకం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని, మీ ఎంపీగా నన్ను దీవించాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను.