Venkatramulu Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువు గ్రామానికి చెందిన కీ. శే పసుల రత్నం – మణెమ్మ దంపతుల కూతురు శ్యామల వివాహం బుధవారం గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ఆర్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు వేంకు గారి రాజిరెడ్డి పుస్తె మట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద వధువు వివాహాలకు పుస్తేమట్టేలు అందజేస్తామని అన్నారు. ఈ సందర్భంగా పెళ్లికూతురు తల్లిదండ్రులు వెంకు గారి రాజిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎ కార్యక్రమంలో దామరచెరువు గ్రామ మాజీ సర్పంచ్ శివప్రసాదరావు, కుస్తీ సిద్దరాములు, ఎల్లా గౌడ్, స్వామి ప్రకాష్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.