కోడలిని దారుణంగా చంపిన మామ
అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కోడలిని మామ గొంతు కోసి హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా, సారంగాపూర్ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని రేచపల్లి గ్రామానికి చెందిన వివాహితను ఆమె మామ ఆకుల రాజీ రెడ్డి బుధవారం తెల్లవారుజామున హత్య చేసినట్లు తెలుస్తుంది. మృతురాలి భర్త తిరుపతి రెడ్డి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్ళాడు. అయితే కోడలికి అక్రమ సంబంధం ఉందనే అనుమానంతోనే మామ రాజిరెడ్డి హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.