Reporter -Silver Rajesh Medak.
Date- 28.04.2024.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా పై నిఘా
ఇతరుల గురించి అనుచిత పోస్టింగ్ లు పెడితే చర్యలు
మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా పర్యవేక్షణ
జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.
ఈ రోజు మెదక్ జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. గారు మాట్లాడుతూ....పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నియమావళిని జిల్లా యంత్రాంగం పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని సోషల్ మీడియా సైట్ల పై ప్రత్యేక నిఘా ఉంచాం, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున పౌరులు బాధ్యతగా నడుచుకోవాలి జిల్లా ఎస్.పి డా..బి.బాలస్వామి ఐ.పి.ఎస్. గారు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, పోలీసు శాఖ అధ్వర్యంలో సోషల్ మీడియా మానిటరింగ్ సెంటర్ లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నాము అని అన్నారు. ఎవరైనా ఇతర వ్యక్తులను, రాజకీయ పార్టీలను ఉద్దేశించి సోషల్ మీడియా అయిన వాట్సప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, x ట్విట్టర్ మొదలగు వాటిలో అనుచితమైన వాఖ్యలు, అనుచిత పోస్టింగ్ లు పెడితే అలాంటి వారి ఎలక్ట్రానిక్ డివైజ్ లు సీజ్ చేసి వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కావున ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్ఠి లో ఉంచుకోవాలని ఈ సందర్భంగా అన్నారు.