రాయిలాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సఖి సిబ్బంది అవగాహన
Venkatramulu Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో చెరువు గట్టు వద్ద ఉపాధి హామీ కూలీలతో మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ సఖికేంద్రం ఆద్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సఖి సిబ్బంది మాట్లాడుతూ.. గృహహింస, వరకట్న వేధింపులు, అత్యాచారాలు ,యాసిడ్ దాడులు, అక్రమ రవాణా, పనిచేసే చోట లైంగిక వేధింపులు, శారీరకంగా, మానసికంగా, లైంగికంగా, ఆర్థికంగా హింసకు గురైనటువంటి మహిళలు సఖి కేంద్రానికి నేరుగా కానీ 181 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ సంప్రదించవచ్చని తెలిపారు. బాల్య వివాహాలు చేయటం వల్ల వచ్చే ఆనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యల గురించి వివరించి 1098 టోల్ ఫ్రీ నెంబర్ గురించి తెలపడం జరిగిందని పేర్కొన్నారు. సైబర్ నేరాలు జరిగితే గనక 1930 నెంబర్ కి కాల్ చేయవచ్చని తెలిపారు. బాధిత మహిళలు ఏదైనా హింస వేధింపుల సమస్యతో వచ్చినప్పుడు ఆమె గాయాలతో ఉంటే మెడికల్ సపోర్ట్ మరియు సైకో సోషల్ కౌన్సిలింగ్, లీగల్ కౌన్సిలింగ్ (మహిళలకు బాలికలకు ఉన్న చట్టాలపై) పోలీస్ సపోర్ట్, బాధిత మహిళకు కుటుంబ సపోర్టు లేకుండా ఎక్కడా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్న వారికి తాత్కాలిక వసతి, మహిళలకు. హింస జరిగినప్పుడు 181 రెస్క్యూ వెహికల్ వచ్చి కావాల్సిన సహకారాన్ని పొందవచ్చని తెలిపారు. మహిళలకు, బాలికలకు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కింది టోల్ ఫ్రీ నెంబర్లను 181,112, 1098, 18004198588, 1930 సంప్రదించాలని అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సఖి కేంద్రం నుండి Worker Smt. M. కళావతి మరియు పారామెడికల్ శ్రీమతి మంజుల,గ్రామ సెక్రటరీ మహేందర్ రెడ్డి,ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.