మీకు మీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్

  • మాలోత్ కవిత గారికి మతిభ్రమించి మాట్లాడుతున్నారు
  • బలరాం నాయక్ గారిని విమర్శించే స్థాయి అర్హత
    మాలోత్ కవితకు లేదు
  • మీకు మీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్
  • ఓటమి భయంతో కారు పార్టీ నాయకులు కారుకూతలు కుస్తున్నారు
  • ఎంపీగా గెలిచి ములుగు నియోజకవర్గానికి ఏమి చేసావు అని ఓట్లు అడగటానికి వస్తున్నావు
  • మహబూబాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం

కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్

తేదీ 27-04-2024,
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా అధ్యక్షులు
పైడాకుల అశోక్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మలోత్ కవిత గారు ఎంపీ గా గెలిచి ములుగు నియోజక వర్గం లో తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదు అని గెలిచిన నాటి నుండి ములుగు వైపు తలెత్తి చూడని మీరు కాంగ్రెస్ పార్టీ నీ మా అభ్యర్థిని విమర్శిస్తారా మీకు మీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని మర్చిపోయారా ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి మా నాయకులు రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారి పోరాటాల ఫలితంగా ఈ రోజు గిరిజన యూనివర్సిటీ మెడికల్ కళాశాల, ములుగు మున్సిపాలిటీ, మల్లం పెల్లి మండలం సాధించుకున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి వర్యులు సీతక్క గారు ప్రత్యేక దృష్టి సారించింది సుమారు 300 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు భవనాలు, సీసీ రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రజల ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5 గ్యారంటీ లు అమలు చేశాం. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం అని ప్రజలు కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని బిఆర్ఎస్ బిజెపి నాయకులకు ఓటమి భయం పట్టుకొని ఇస్తమున్నట్లు మాట్లాడితే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గారు గతం లో కేంద్ర మంత్రి గా సీతక్క గారు ఎంఎల్ఏ గా ఉన్నప్పుడు ములుగు ఏరియా హాస్పటల్ కు నిధులు నేషనల్ హైవే ఏటూరు నాగారం వేంకటా పురం మధ్య బ్రిడ్జి నిర్మాణం కస్తూర్బా స్కూల్స్,సబ్ స్టేషన్లు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు అని కేంద్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రి అవడం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!