నేడు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణంలో గౌరవ పట్టణ అధ్యక్షులు సాదు వైకుంఠరావు గారి ఆధ్వర్యంలో జరిగిన 18,19వ వార్డు వైస్సార్సీపీ నాయకులు ఆత్మీయ సమావేశం లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న
శ్రీకాకుళం MP అభ్యర్థి శ్రీ పేరాడ తిలక్ గారు
తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ గారు
ఈ సమావేశంలో గౌరవ శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి పేరాడ తిలక్ గారు మాట్లాడుతూ…,
➡️ ఈ శ్రీకాకుళం జిల్లాలో మునుపెన్నడు లేని విదంగా అభివృద్ధి పథంలో నడిపించి,అభివృద్ధి చేసి చూపించిన నాయకులు గౌరవ ముఖ్యమంత్రివర్యులు ప్రజానేత జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నారు.
➡️గత తెలుగుదేశం ప్రభుత్వంలో పార్టీ పెట్టిన 40సంవత్సరాలలో చంద్రబాబు 25 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ రాష్ట్రానికి గాని, శ్రీకాకుళం జిల్లాకు గాని చేసిన అభివృద్ధి ఏంటని నిలదీశారు.
గత 10 సంవత్సరాలు తెలుగుదేశం శ్రీకాకుళం ఎంపీగా ఉండి కనీసం ఏ నాడైనా ఈ శ్రీకాకుళం జిల్లా సమస్యలు పైన గాని, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పైన గాని, ఎప్పుడైనా కలెక్టర్ గారికి వినతిపత్రం అందించావా…? నువ్ చేసిన ఏమి అభివృద్ధి చూపించి ఈ జిల్లా ప్రజలకు ఓట్లు అడుగుతున్నావ్..? ఇంకా జిల్లా ప్రజలకు మోసం చెయ్యాలని చుస్తే, రానున్న ఎన్నికల్లో మీకు తగిన బుద్దిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
➡️ కుల,మత,ప్రాంతీయ విభేదాలకు తావులేకుండా అవినీతి రహిత,పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలుచేసారని ఆయన అన్నారు. గ్రామ,వార్డు సచివాలయాల వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవటంతో పాటు, రైతులను ఆదుకునేందుకు నందిగాంలో ఆఫ్ సోర్ రిజర్వాయర్, మూలపేట పోర్టు ఇచ్చి ఆరు రాష్ట్రాల ముడి సరుకులు మన జిల్లా నుండే ప్రపంచం మొత్తం సరఫరా చేసి శ్రీకాకుళం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి, శ్రీకాకుళం జిల్లాని దేశానికే పరిచయం చేసారన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి., అంతే స్థాయిలో సంక్షేమాన్ని ప్రజల్లో తన స్థానాన్ని మరింత పదిల పరుచుకొని ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఎంతో నిబ్బరంగా పాలన ప్రజలకు అందించారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల పథకాలు అమలు పరుస్తూ ఆదర్శవంతమైన పాలన అందించడం జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం అయిందని అన్నారు.
➡️ మరో 15 రోజుల్లో జరగనున్న ఎన్నికల సంగ్రామంలో మన ఈ శ్రీకాకుళం జిల్లాలో వైస్సార్సీపీ జెండా విజయ కేతనం ఎగురవేసే విదంగా శ్రీకాకుళం MP అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీ పేరాడ తిలక్ గారు ని, శ్రీకాకుళం నియోజకవర్గం MLA అభ్యర్థిగా పోటీచేయుచున్న శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు,జడ్పీటీసీలు,ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, పట్టణ అధ్యక్షులు,వార్డు సభ్యులు, JCS కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు,18,19వ వార్డులలోని వివిధ హోదాలో గల నాయకులు,కార్యకర్తలు,అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నారు.