సిద్దిపేట ఇలాకలో.. హోరెత్తిన మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం..

Reporter -Silver Rajesh Medak.

Date-26/04/2024.

సిద్దిపేట ఇలాకలో..

హోరెత్తిన మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం..

మొదటిసారిగా సిద్దిపేటకు విచ్చే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు.

బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుంచి.. కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ వరకు ర్యాలీ

మంత్రివర్యులు కొండా సురేఖ, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సిద్దిపేట ఇన్చార్జి పూజల హరికృష్ణ, గజ్వేల్ ఇంచార్జి నర్సిరెడ్డి, దుబ్బాక ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డిలతో కలిసి ప్రచారం..

సిద్దిపేట ఇలాకలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం హోరెత్తింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు శుక్రవారం సిద్ధిపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రచారం చేపట్టారు. స్థానిక బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ ఓల్డ్ బస్టాండ్, నర్సాపురం క్రాస్ రోడ్, లాల్ కమాన్, గాంధీ విగ్రహం, ఇందిరాగాంధీ విగ్రహం, రూరల్ పోలీస్ స్టేషన్ మీదుగా కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ వరకు ప్రచార ర్యాలీని చేపట్టారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జి కొండా సురేఖ, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సిద్దిపేట ఇన్చార్జి పూజల హరికృష్ణ, గజ్వేల్ ఇన్చార్జి తూముకుంట నర్సిరెడ్డి, దుబ్బాక ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకురాలు తూముకుంట ఆకాంక్ష హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచార రథంలో అభివాదం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ముఖ్యంగా యువత ఒకసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సూచించారు. దేశంలో, రాష్ట్రంలో కొన్ని పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు. ఆయా పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో వారికి ఓట్ల ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. మంత్రి సురేఖ, అభ్యర్థి నీలం మధుకు మహిళలు మంగళహారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు టీ.శ్రీనివాస్ గౌడ్, గంప మహేందర్, కలీమొద్దీన్, సాకి ఆనంద్, బుచ్చిరెడ్డి, మార్క సతీష్, అత్తు ఇమామ్, లక్ష్మి, చక్రధర్ గౌడ్, దేవులపల్లి యాదగిరి, చిట్టి దేవేందర్ రెడ్డి, ఎస్టిడి శ్రీనివాస్, మీసం నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి బొమ్మల యాదగిరి, దర్పల్లి చంద్రం, పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు..

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!