Venkatramulu Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కాట్రియాల మరియు పర్వతాపూర్ గ్రామాల నందు ఉపాధి హామీ కూలీలతో మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో సఖికేంద్రం ఆద్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గృహహింస, వరకట్న వేధింపులు, అత్యాచారాలు ,యాసిడ్ దాడులు, అక్రమ రవాణా, పనిచేసే చోట లైంగిక వేధింపులు, శారీరకంగా, మానసికంగా, లైంగికంగా, ఆర్థికంగా హింసకు గురైనటువంటి మహిళలు సఖి కేంద్రానికి నేరుగా కానీ 181 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ సంప్రదించవచ్చు అని మరియు బాల్య వివాహాలు చేయటం వల్ల వచ్చే ఆనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యల గురించి వివరించి 1098 టోల్ ఫ్రీ నెంబర్ గురించి తెలపడం జరిగింది, మరియు సైబర్ నేరాలు జరిగితే గనక 1930 నెంబర్ కి కాల్ చేయవచ్చని తెలపడం జరిగింది.బాధిత మహిళలు ఏదైనా హింస వేధింపుల సమస్యతో వచ్చినప్పుడు ఆమె గాయాలతో ఉంటే మెడికల్ సపోర్ట్ మరియు సైకో సోషల్ కౌన్సిలింగ్, లీగల్ కౌన్సిలింగ్ (మహిళలకు బాలికలకు ఉన్న చట్టాల పై), పోలీస్ సపోర్ట్, బాధిత మహిళకు కుటుంబ సపోర్టు లేకుండా ఎక్కడా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్న వారికి తాత్కాలిక వసతి, మహిళలకు. హింస జరిగినప్పుడు 181 రెస్క్యూ వెహికల్ వచ్చి కావాల్సిన సహకారాన్ని అందించడం జరుగుతుంది, మహిళలకు, బాలికలకు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కింది టోల్ ఫ్రీ నెంబర్లను181,112,1098,18004198588, 1930 సంప్రదించాలని అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సఖి కేంద్రం నుండి Case Worker Smt. M. కళావతి , మరియు పారామెడికల్ శ్రీమతి k. మంజుల, గార్లు, గ్రామ సెక్రెటరీలు లక్మి, ధనలక్ష్మి గార్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.