Venkatramulu Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ స్వగ్రామానికి చెందిన కడుపేద కుటుంబమైన బైండ్ల మైసవ్వ సిద్ధరాములు కూతురు జానకి వివాహానికి మానవతా దృక్పధం కలిగిన జడ్ చెర్వు తండాకు చెందిన డాక్టర్ మోహన్ నాయక్ వారు హృదయం చలించి మంచి మనసుతో ఆ కుటుంబానికి ఈ వివాహ కార్యక్రమంలో పుస్తె మట్టెలు బహుకరించి మానవత్వం చాటుకున్నారు. ఈ వివాహానికి. సహాయం అందించిన డాక్టర్ మోహన్ నాయక్ కుటుంబానికి ఆ గ్రామస్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషన్ నాయక్, కాంగ్రెస్ నాయకులు కె.విద్యసాగర్, మామిడి సిద్ధ రాములు, బైండ్ల నందు, స్వామి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.