స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 22, మహానంది:
ముగ్గురు యువకులకు ఏడు రోజుల పాటు జైలు శిక్ష సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ విధించినట్లు మహానంది ఎస్సై నాగేంద్రప్రసాద్ పేర్కొన్నారు. మహానంది మండలంలోని బొల్లవరం గ్రామానికి చెందిన గుండా మధు, తమడపల్లె గ్రామానికి చెందిన బత్తిని అశోక్, నందవరం మండలం పలుకూరు గ్రామానికి చెందిన జమల్ మధు, వీరందరూ కలిసి తమ్మడపల్లె గంగమ్మ గుడి ఎదురుగా ఉన్న, స్పీడ్ బ్రేకర్ల వద్ద, వాహనాలను ఆపుతూ, ప్రజాశాంతికి భంగం కలిగిస్తూ, పాటలు, సైగలు ద్వారా అశాంతిని కలిగిస్తూ ఉండడంతో, అరెస్టు చేసి వీరిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, ఏడు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. యువత పెడదోవ పడుతూ, హద్దు మీరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే, కఠిన చర్యలు తప్పవని ఎస్సై నాగేంద్ర ప్రసాద్ హెచ్చరించారు.