Reporter -Silver Rajesh Medak.Date-22/04/2024.
80 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు ,దివ్యాంగులు సులభంగా ఇంటి వద్దనే హోమ్ ఓటింగ్ సౌకర్యం దరఖాస్తు ఫారం-12 డి సమర్పించాల్సిన చివరి తేదీ 23.04.205 ముగియనుంది జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
జిల్లాలో (07) సెగ్మెంట్లలో 1619 వయోవృద్ధులు,9505 దివ్యాంగుల కు ఫారం-12-D పంపిణీ*
ఈనెల 25 నుండి ఓటర్ సమాచార స్లిప్పులు పంపిణీ*
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు, అత్యవసర సర్వీస్ లలో ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం.
పర్యవేక్షణ చేస్తున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ఓటింగ్ శాతం తక్కువ నమోదైన పోలింగ్ కేంద్రాల పరిధిలో కళాజాత ప్రదర్శనలు.40శాతం, ఆపై వైకల్యం కలిగిన దివ్యాంగులు, 80ఏళ్లకు పైబడిన ఓటర్లకు పార్లమెంట్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం దరఖాస్తు ఫారం-12 డి సమర్పించాల్సిన చివరి తేదీ 23.04.205 ముగియనుందని ఈ విషయాన్ని గమనించాలనిజిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.సోమవారం జిల్లా కలెక్టర్ మెదక్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ కలెక్టర్ కార్యాలయం నుండి పార్లమెంట్ ఎన్నికల్లో దివ్యాంగులు వయోవృద్ధులు హోం ఓటింగ్ కార్యక్రమం, ఓటర్ సమాచార స్లిప్పుల బూత్ లెవెల్ అధికారుల ద్వారా పంపిణీ సంబంధిత వివరాలపై సమగ్ర సమాచారాన్ని తెలియజేస్తూ జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులు వృద్ధులు సులభంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని.. ర్యాంపు, వీల్ చైర్ సౌకర్యం ను కల్పిస్తున్నామని అలాగే పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు అస్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అధికారులు కల్పిస్తున్నారని అన్నారు.ఓటరు సమాచార స్లిప్పులను కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా పంపిణీ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుగా పర్యవేక్షణ చేస్తున్నామన్నారుఓటర్స్ అందరికీ ఈనెల 25వ తేదీ నుండి వచ్చే నెల 7వ తేదీ వరకు ఓటర్ సమాచార స్లిప్పుల పంపిణీ సంబంధిత తాసిల్దార్ల పర్యవేక్షణలో బిఎల్ఓ ల ద్వారా పంపిణీ చేసేందుకు పగడ్బందీగా చర్యలు చేపట్టామని వివరించారు.ఫారం -12 డి ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఓం ఓటింగ్ కార్యక్రమం మొదటి విడతగావచ్చే నెల 3- 5-2024 నుండి 06-05-2024 వరకు ఉంటుందని అన్నారు.అదేవిధంగా రెండో విడత ఓటింగ్ 08.05.2023 ప్రారంభమవుతుందని వివరించారు.తమ బూత్ పరిధిలోBLO ఓటర్ స్లిప్‌ను నమోదిత ఓటరుకు లేదా ఓటరు కుటుంబంలోని వయోజన సభ్యునికి అందజేస్తున్నారు. BLO ఓటర్ స్లిప్‌ను స్వీకరించినందుకు రసీదుగా, రిజిస్టర్‌లో ఓటర్ స్లిప్ పంపిణీ చేయబడిన వ్యక్తి యొక్క సంతకం లేదా బొటనవేలు ముద్రను తీసుకుంటారని చెప్పారు.ఓటరు స్లీప్ తో పాటు సి-విజిల్ పాంప్లెట్ ను ఓటరు కు అందజేస్తున్నారు. అలాగే ప్రతి కుటుంబానికి ఓటరు గైడ్ ను అందజేస్తారన్నారు.ఓటింగ్ శాతం తక్కువ నమోదైన పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లను చైతన్యం చేసేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి లలో కళాజాత ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని వివరించారు.