నార్సింగి మండల కేంద్రంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం వద్ద రథోత్సవం అశేష భక్తుల నడుమ వేడుకగా ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సీతారాముల కల్యాణంతో ప్రారంభమైన ఉత్సవాలు శనివారం వేణుగోపాల స్వామి రథోత్సవంతో ముగిశాయి స్వామివారి రథాన్ని అందంగా అలంకరించి వందలాది మంది భక్తులు పాల్గొనగా నార్సింగి గ్రామ పురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు భక్తులు నార్సింగిలో వున్న యూత్ సభ్యులు అందరూ పాల్గొని విజయవతం చేశారు.