Reporter -Silver Rajesh Medak.
Date-21/04/ 2024.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు జిల్లాలో 410 కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభం అయ్యాయని, అన్ని కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం సేకరించటం జరిగిందని * మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ * నేడోక ప్రకటన లో తెలిపారు.
ఇప్పటివరకు 2,711 రైతుల నుండి 11,632 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు.
143 మంది రైతులకు ఒక కోటి 51 లక్ష ల రూపాయలు పేమెంట్ చేయడం జరిగిందని వివరించారు
ప్రస్తుతం అన్నిచోట్ల అకాల వర్షాలు పడుతున్నాయి. అన్ని కేంద్రాలలో సరిపడు టార్పాలిన్ కవర్ లు
410 సెంటర్లలో 3,200 అందుబాటులో ఉంచి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి రక్షణ కల్పిస్తున్నామన్నారు.
అకాల వర్షాల దృష్ట్యా ఇంకా అవసరమగు చోట్ల సరిపడు టార్పాలిన్ కవర్ లు సమకూర్చాలని మార్కెటింగ్ శాఖను ఆదేశించండమైనదన్నారు.
ధాన్యం కొనుగోలులో ఎటువంటి జాప్యం లేకుండా కొనుగోళ్ళు జరిపి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, 100% ట్యాబ్ ఎంట్రీ పూర్తీ చేయాలనీ DRDO, DCO, DAO
క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలు పర్యవేక్షించుటకు మండల ప్రత్యేక అధికారులను తహసిల్దారులను నియమిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు
అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రలలో కొనుగోళ్ళును పర్యవేక్షించాలని ఆదేశించండమైనదన్నారు
రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి ఎటువంటి జాప్యం లేకుండా వేగంగా జరగాలని, తడిసిన ధాన్యమును వెంటనే మిల్లులకు తరలించాలని పౌరసరఫరాల శాఖా అధికారులను ఆదేశించండమైనదని, రైస్ మిల్లర్లు ధాన్యంలో ఎటువంటి కోతలు పెట్టరాదని ఆదేశించండమైనదని కలెక్టర్ తెలిపారు.
నిన్న కురిసిన వర్షాలలో జిల్లాలో ఎక్కడ దాన్యం ఎక్కువగా తడవలేదని, అయినను అదనపు కలెక్టర్ (రెవిన్యూ), DCSO, DMCSC, DRDO, DAO & DCO సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వటం జరిగిందని అన్నారు.
రైతులు అధైర్య పడొద్దని, కొనుగోలు కేంద్రాలలో ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులు దళారుల వద్ద మోసపోకుండా కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని కలెక్టర్ కోరారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏదైనా సమస్యలుంటే రైతులు కంట్రోల్ రూమ్ నెంబర్ 9281103685 కు సంప్రదించవలసిందిగా తెలిపారు.