ఆధ్యాత్మికత పెంపొదిoచుకోవాలి-కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ పామేన బీమ్ భరత్..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రేగడి ఘనాపూర్ గ్రామం లో శ్రీ పోచమ్మ దేవి, నాగ, గ్రామ నాభి శిల సహిత ద్వజ స్థభ ప్రతిష్ట మహోత్సవం..

భారీ ఎత్తున ఏర్పాట్లు..

చేవెళ్ల :

ఆధ్యాత్మికత పెంపొదిoచుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ పామేన బీమ్ భరత్, పీసీబీ చైర్మన్ చింపుల సత్య నారాయణ రెడ్డి అన్నారు. గ్రామస్థులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపు కాస్తూ ఉండే దేవత అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రేగడి ఘనాపూర్ గ్రామం లో శ్రీ పోచమ్మ దేవి, నాగ, గ్రామ నాభి శిల సహిత ద్వజ స్థభ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు.

ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం వారు మాట్లాడుతూ… గ్రామాల్లో గ్రామ దేవతల ప్రతిష్ట, పూజలు చేయాలన్నారు. ప్రజల్లో భక్తిపర్వస్యం పెంపొందిందన్నారు. గ్రామదేవతల పూజావిధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సంప్రదాయన్నారు. మానవుడు నిత్య జీవితంలో ఎన్నో జయాపజయాల్ని చవి చూస్తున్నాడన్నారు. మరో వైపు తన లక్ష్య సాధనకోసం ఎన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడన్నారు. మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్టికి మూల కారకురాలు మాతృదేవత అని గ్రహించిన పురాతన మానవుడు, ఆమెను సంతృప్తి పరచేటందుకు ఎన్నో మార్గాలను ఆశ్రయించాడన్నారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ లు వెంకట్ రెడ్డి, నర్సింహాలు, రాంరెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గిరిదర్ రెడ్డి, యువ నాయకుడు రఘు వీర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు ఆగిరెడ్డి, పీ ఎ సీ ఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి,ఎంపీటీసీ సభ్యులు గుండాల రాములు, చేవెళ్ల మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్,మాజీ ఎంపీటీసీ పెంటయ్య, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఈదుల పల్లి రాములు, tuwj జర్నలిస్ట్ సంఘo జిల్లా హొసింగ్ సొసైటీ ఉపాధ్యక్షులు రాజేష్, కాంగ్రెస్ నాయకులు సామ అంజి రెడ్డి, చంద్ర రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, పల్గుట శ్రీనివాస్, పాండు, మాణిక్యం,యాదిరెడ్డి,కావడి తిరుపతి రెడ్డి, విజేందర్ రెడ్డి,హన్మంత్ రెడ్డి,సిర కృష్ణ రెడ్డి, వెంకటేష్ గుప్తా, శ్రీకాంత్ రెడ్డి, దినేష్ రెడ్డి, శివానోళ్ల మాణిక్య రెడ్డి, బీజేపీ మండలం అధ్యక్షులు పాండు రంగారెడ్డి,నీలయోళ్ల నిల్ రెడ్డి, తిప్పని బుచ్చి రెడ్డి, ఉమశంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!