గత ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతులకు శాపం – ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి నియోజకవర్గం తేదీ: 18 – 04 – 2024

ఈరోజు పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సి రెడ్డి పాలకుర్తి మండలం లోని వివిధ గ్రామాల రైతులకు సంబంధించి ఎస్సారెస్పీ కాలువలను సందర్శించి పరిశీలించడం జరిగింది. అనంతరం తను మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వం మరియు మాజీ మంత్రి దయాకర్ రావు చేసిన నిర్లక్ష్యము వలన రైతులకు శాపంగా మారిందని అన్నారు. కోమటిగూడెం, బోయిన గూడెం, గూడూరు, కోతుల బాగ్, తిరుమలగిరి, నర్సింగాపూర్ గ్రామాలకు సంబంధించి ఎస్ ఆర్ ఎస్ పి కెనాల్ కు సంబంధించి 4L మరియు 5L పాయింట్లను సందర్శించి వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి ఆయా గ్రామాలలోని రైతుల గోడును క్షుణ్ణంగా విన్నారు. తప్పకుండా రైతులకు న్యాయం చేయడనిధులురైతులకు సంబంధించిన ప్రతి ఎకరాకు సాగునీ అందించేందుకు తప్పక కృషి చేస్తానని అన్నారు. ఇట్టి కాలువలకు సంబంధించి సంబంధిత అధికారులతో పూర్తిస్థాయి పనులకు ఎస్టిమేషన్లు తెప్పించి ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి పనులు పూర్తి చేసి రైతులను కాపాడుకుంటానని అన్నారు. ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు చేసేటువంటి అసత్య ప్రచారాలను రైతులు గమనిస్తున్నారని ఇలాంటి తప్పుడు కూతలు కూస్తే అటువంటి నాయకులను ప్రజలు గ్రామాల్లో తిరగనివ్వరని గుర్తు చేశారు..

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ మండల అధ్యక్షులు గీరగాని కుమార స్వామి పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాద్ ఓబీసీ నాయకులు పుల్లి గణేష్ ఎస్సీ సెల్ నాయకులు జలగం కుమార్ మాజీ సర్పంచులు పుల్లయ్య అశోక్ శ్రీనివాస్ పాలకుర్తి పట్టణ అధ్యక్షులు నాగయ్య యువ నాయకులు మహేందర్ లతోపాటు ఆయా గ్రామాల కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు..

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!