Reporter -Silver Rajesh Medak.
తేదీ 16-4-2024.
ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేయాలి
కొనుగోలు కేంద్రాల పరిశీలనలో అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు
వరి ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేయాలని అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు ఆదేశించారు.
నర్సాపూర్ amc లో ఏర్పాటు చేసిన పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కల్పించిన వసతులు, రిజిస్టర్లు, తూకాలు, నూతనంగా ప్రవేశ పెట్టిన ఐరిస్ విధానం, ట్యాబ్ ఎంట్రీలు పరిశీలించి, అధికారులు, నిర్వాహకులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం రైతులు తమ ధాన్యాన్ని తాలు, తప్ప లేకుండా, తేమ శాతం 17 ఉండేలా చూసుకుని కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2203, గ్రేడ్ బీ రకానికి రూ.2183 నిర్ణయించిదని వెల్లడించారు. దళారులకు ధాన్యం విక్రయించవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.