Reporter -Silver Rajesh Medak.
Date-16/04/2024.
నామినేషన్ల ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్
అధికారి రాహుల్ రాజ్.
నామినేషన్ల ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని – మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికలు -2024 నిర్వహణ లో భాగంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18 నుండి మెదక్ కలెక్టరేట్లో స్వీకరించనున్న నేపధ్యంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం మంగళవారం మెదక్ ఆర్ డి ఓ రమాదేవి, ఆర్డీవో జై చంద్ర రెడ్డి లతో కలసి బారికేడ్ల ఏర్పాటు, పోలీసు బందోబస్తు, మీడియా పాయింట్ తదితర ఏర్పాట్లపై మెదక్ కలెక్టరేట్ ఆవరణ లో క్షేత్ర స్థాయి లో కలెక్టర్ పరిశీలించి సమర్ధవంతంగా ఏర్పాట్లు చేయుటకు అధికారులకు తగు సూచనలు చేశారు.
నామినేషన్ స్వీకరించే రోజైన ఈనెల 18 నుంచి ఈ నెల 25 తేదీ నామినేషన్ ప్రక్రియ ముగిసే వరకు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వందమీటర్ల దూరం వరకు సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ఇతరులను ప్రవేశించకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. నామినేషన్ల స్క్రూట్నిని నిర్వహించే సమాచారం అభ్యర్థులకు తెలియజేసి, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నామినేషన్ల పూర్తి ప్రక్రియను సీసీ కెమెరాలు, వీడియోగ్రాఫి మధ్య చేపట్టాలన్నారు. అభ్యర్థి ఆర్ ఓ గది లోకి ప్రవేశించగానే కనబడేలా గడియారం ఏర్పాటు చేయాలని, అన్నారు.
నామినేషన్ సమర్పించు అభ్యర్థులు 30 నిమిషాలు ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని, చివరి నిమిషం వరకు వేచిచూసే ధోరణి సరికాదని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.