Reporter -Silver Rajesh Medak.
Date- 15/04/2024.
మెదక్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ మున్సిపల్ చైర్మెన్ తో సహా కౌన్సిలర్ ల చేరికలు-
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
- ఎమ్మెల్యే రోహిత్ అభివృద్ధి ని చూసి పార్టీలోకి చేరికలు
– మెదక్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఖాళీ.
మెదక్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి హరీష్ రావ్ ఇన్ఛార్జ్ గా ఉన్న మెదక్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఖాళీ అయ్యింది. మెదక్ మాజి ఎంఎల్ఏ మైనంపల్లి హ్మంతరావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ లే కాకుండా మున్సిపల్ చైర్మెన్ కూడా ఏకంగా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధికి నిదర్శనం అని పలువురు అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా సోమవారం మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ చొరవతో బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మెన్ తొడుపునూరి చంద్రపాల్, కౌన్సిలర్ లు 6వ వార్డు కౌన్సిలర్ రాగి వనజ అశోక్, 32వ వార్డు కౌన్సిలర్ గోదల మానస సాయిరాం, 20వ వార్డు కౌన్సిలర్ లక్ష్మినారాయణ గౌడ్, 7వ వార్డు కౌన్సిలర్ అంజద్, 11వ వార్డు కౌన్సిలర్ షమీ, 21వ వార్డు కౌన్సిలర్ పెండ్యాల నిర్మల, నిఖిల్, 2వ వార్డు కౌన్సిలర్ కొర్వి రాములు, మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ఉమేర్, 29వ వార్డు కౌన్సిలర్ బొద్దుల రుక్మిణి క్రిష్ణ గౌడ్, 4వ వార్డు కౌన్సిలర్ శ్రీధర్ యాదవ్ లతో పాటు ఆత్మకమిటీ వైస్ చైర్మెన్ వెంకటనారాయణలకు మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీ కండూవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మున్సిపల్ చైర్మెన్ తొడుపునూరి చంద్రపాల్ మాట్లాడుతూ వందరోజుల్లో నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అభివృద్ధి చూసి పార్టీలోకి చేరుతున్నట్లు తెలిపారు.