-అసోసియేట్ డీన్ డాక్టర్. జయలక్ష్మి
ఘనంగా అంబేద్కర్ జయంతి
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 14, మహానంది:
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబా సాహెబ్ అంబేద్కర్ అని అసోసియేట్ డీన్ డాక్టర్ జయలక్ష్మి అన్నారు. ఆదివారం మహానందిలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జయలక్ష్మి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించడంలో చాలా కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి కావాల్సిన అన్ని హక్కులు, రాజ్యాంగంలో పొందుపరిచారని, మానవాళి జీవన మనుగడ ముందుకు సాగేందుకు ఆయన జీవితం ఆదర్శమని, సామాజిక రుగ్మతలను అనుభవించి, భావితరాల భవిష్యత్తుకు రుగ్మతలు అడ్డుకారాదని హక్కులు కల్పించారన్నారు.చదువే మార్పుకు మూలమని, ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకోవాలని,చదువు మనిషికి మూడో నేత్రమని అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఓ ఎస్ ఏ డాక్టర్ విజయ్ భార్గవ్, ఎస్సీ ఎస్టీ సెల్ ఇంచార్జ్ డాక్టర్ వెంకటేష్ బాబు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.