మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో పంట పొలాల్లో వరి కోతులు కోసి రోడ్లపై ధాన్యాన్ని ఎండబెట్టె రైతులపై కఠిన చర్యలు తీసుకుంటామని రామాయంపేట ఎస్సై రంజిత్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ రామాయంపేట మండలంలోని పలు ప్రధాన రహదారులలో దయచేసి ఎవరు కూడా కోసినటువంటి వరి ధాన్యాన్ని రోడ్లపై ఎండబెట్టరాదని తెలిపారు. ఈ విధంగా చేయడం వల్లన పగలు రాత్రి వాహనాలపై వెళ్లేవారు ప్రమాదవశాత్తు జారిపడి రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో పడకుండా ఉండేందుకు రైతులు చట్టాన్ని అతిక్రమించి రోడ్లపై ధాన్యాన్ని ఎండ పెడితే ఏవైనా రోడ్డు ప్రమాదం జరిగితే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే ప్రజలు సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరు వ్యవహరించాలని ఆయన సూచించారు.