Reporter -Silver Rajesh Medak.
Date-14/04/2024.
ప్రజాస్వామ్యాన్ని… భారతదేశానికి పరిచయం చేసిన మహానీయులు
డా. భీంరావ్ రాంజీ అంబేద్కర్
- భారతదేశ ప్రజల రాతను మార్చిన మహానీయుడు అంబేద్కర్
- హక్కులతో పాటు బాధ్యతలతో కూడిన రాజ్యాంగాన్ని సృష్టించిన మహానీయుడు
- క్యాంప్ కార్యాలయంలో ఘనంగా 134వ జన్మదినోత్సవ వేడుకలు
- నేటి యువత అంబేద్కర్ అడుగుజాడలో నడువాలి
– కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాది జీవన్ రావ్.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. భీంరావ్ రాంజీ అంబేద్కర్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయావాది జీవన్ రావ్ అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా 134వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయావాది జీవన్ రావ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని భారతదేశానికి పరిచయం చేసిన మహానీయులు అని అన్నారు. సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి, అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన కృషికి దేశ ప్రజలంతా ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు దొంతి లక్ష్మి ముత్యంగౌడ్, దాయర లింగం, మెంగని విజయలక్ష్మి, మాజీ కౌన్సిలర్ లు బట్టి సులోచన, ఎస్.డి.జ్యోతి క్రిష్ణ, హరిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ పవన్, రామాయంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ గంగా నరేందర్, మందుగుల గంగాధర్, గూడూరి క్రిష్ణ, దాయర రవి, భూపతి, బాల్ రాజ్, ఇస్మాయిల్, లల్లూ, రామస్వామి, సుభాష్ చంద్రబోస్, మన్సూర్ అలీ, గాడి రమేశ్, రమేశ్, జిలకరి రాజలింగం, మొండి పద్మారావ్, ప్రభాకర్, దశరత్, నాగరాజు, దేవులా, మధు, సలీం, కరీమ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.