రాజన్న సిరిసిల్ల : మాజీ స్పీకర్ శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు 25వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించిన సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన పిసిసి క్యాంపెను కమిటీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. దివంగత మాజీ స్పీకర్ శ్రీపాద రావు గారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా పనిచేసే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో బడుగురు బలహీన వర్గాలకు ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధానా నిర్ణయాలలో ఆయన పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకం అలాగే ఆయన హయాంలో శిశు మహిళ సంక్షేమ కమిటీ ఏర్పాటు చేసిన ఘనత శ్రీపాద రావు గారు అలాగే ఆయన రాజకీయ జీవితం గ్రామ సర్పంచిని మొదలుకొని ఐదుసార్లు మంథని నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఎన్నికై స్పీకర్గా బాధ్యతలు చేపట్టి ఎన్నో కార్యక్రమాలు చేసిన మహనీయులు శ్రీపాద రావు అని కొనియాడుతూ వారి పరంపరలో వారి కుమారులు శ్రీధర్ బాబు… శ్రీపాద రావు యొక్క ఆశయాలను కొనసాగిస్తూ పేద ప్రజల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి దేంగా పనిచేస్తూ ఈ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి వంద రోజుల్లోనే ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తున్నటువంటి శ్రీధర్ బాబు వారి తండ్రిగారి బాటలో నడుస్తూ… వారి ఆశయాలను నెరవేరుస్తూ ఉన్న సందర్భంగా మేమందరం కూడా వారి వెంట ఉంటూ వారి ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ సైనికులుగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం… ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర్య దేవరాజు గారు.. పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చిందం శ్రీనివాస్.. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధికార ప్రతినిధి.. రెడ్డి మల్ల భాను.. జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి.. అకినే సతీష్..పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు శ్రీరామ వెంకటేశం.. జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వెంగళ అశోక్.. జిల్లా ఎస్సీ సెల్ కో కన్వీనర్ మంగా కిరణ్… జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రియాజుద్దీన్.. తాటికొండ శ్రీనివాస్.. దత్తు… సంఘం శ్రీనివాస..మల్లికార్జున్.. వేణు.. బాలరాజు.. నూనె శ్రీనివాస్.. సల్మాన్.. తదితరులు పాల్గొన్నారు.