Reporter -Silver Rajesh Medak.
Date-12/04/2024.
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు తెలిపారు.
శుక్రవారం రోజున క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హవేలీ ఘన్పూర్ మండల్ బూరుగుపల్లి , వడి, రాజుపేట, కొత్తపల్లి, గాజిరెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించి ముందుగా గ్రామాల్లో తాగునీటి సమస్యపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా
నీటి సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. అనంతరం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పూర్తిస్థాయిలో కొనుగోలు రైతులకు అందుబాటులోకి వచ్చాయని జిల్లాలో పండించిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఆరోపణలు రాకుండా రైతుల నుండి సమయానికి కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.
అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వరిధాన్యం కోతకు వచ్చినందున ఆయా ప్రాంతాల్లో రైతుల నుండి వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు.
17 శాతం తేమ శాతంపై రైతులకు అవగాహన కల్పించాలని, రైతులు నాణ్యత గల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందాలని, కొనుగోలు కేంద్రాలలో సరిపడినంతగా టార్పాలిన్లు, గన్ని బ్యాగులు సిద్ధంగా ఉంచుకోవాలని,వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పాలుపంచుకొనే అధికారులందరూ అప్రమత్తంగా ఉండి కొనుగోలుకు ఎలాంటి సమస్య రాకుండా చూడాలని ఒకవేళ కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్య తలెత్తితే వెంటనే తెలియ చేయాలని ఆదేశించారు.
వరిధాన్యం కొనుగోలు బాధ్యత సంబంధిత శాఖలదేనని వివరించారు .
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, ఫ్యాక్స్ సీఈవో సాయి, సంబంధిత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.