Reporter -Silver Rajesh Medak.
తేదీ.12.04.2024.
ఓటు హక్కు వినియోగంపై తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు:
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ ఎలక్ట్రోర్రల్ పాటిస్పేషన్ (స్వీప్)కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై, ప్రతి ఒక్కరికి తమ ఓటు విలువను తెలిపే విధంగా, గ్రామీణ & పట్టణ ప్రాంత ఓటర్లకు చైతన్యం కల్పించడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కలకారులు లచే నిర్వహించడం జరుగుతుందనీ జిల్లా పౌర సంబంధాల అధికారి రామచంద్ర రాజు ,Sveep నోడల్ అధికారి రాజిరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని . పగడ్బందీగా నిర్వహిస్తున్నారు .
శుక్రవారం మెదక్ పట్టణం లో నర్సాపూర్ మున్సిపాలిటీ నర్సాపూర్ బస్టాండ్ చౌరస్తా .గ్రామంలో, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఓటు హక్కు పొంది ఉండాలి. ఓటు హక్కు మన అందరి హక్కు అని, రాజ్యాంగం ద్వార కల్పించిన ఓటు హక్కును భారత దేశంలోనీ పౌరులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఓటర్ నమోదులో పేర్లు తప్పులున్న సరి చేసుకోవాలి ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి ప్రజలకు సాంస్కృతిక సారథి కళాకారులచే మాట పాటల ద్వారా వివరించారు కళాకారులు అవగాహన కల్పించారు.
తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఓటర్లు విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకొని రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని ఆట పాటల ద్వారా కళ ప్రదర్శనను ఇచ్చి ప్రజలలో ఓటు హక్కు పై గొప్ప అవగాహనను పెంపొందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఎలా సిద్దులు టీం లీడర్ .బిట్ల ఎల్లయ్య, శివ్వోల్ల కృష్ణ కారంగుల మాధవి,టేక్మల్ విజయ లక్ష్మి. సందుల శేఖర్ జింక దేవదాస్
ఆ స రామారావు తదితరులు పాల్గొన్నారు.