Venkatramulu, Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా ప్రతి ఏటా కోటమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటిరోజు మంగళవారం ఉదయం అమ్మవారికి కళ్యాణం ప్రత్యేక పూజలు గ్రామస్తులు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడను ప్రజలకు అక్కడ వితరణ చేశారు. తదనంతరం గ్రామంలో కోటమ్మ ఆలయం సమీపంలో అర్చకులు పంచాంగ శ్రవణం పఠనం చేశారు. సాయంత్రం గ్రామస్తులు ఊరేగింపుగా గ్రామంలో నుండి కోటమ్మ ఆలయం వరకు బోనాలను మహిళలు ఊరేగింపుగా డప్పు చప్పుల మధ్య అమ్మవారి ఆలయం వద్దకు తీసుకెళ్లి పెద్ద ఎత్తున సమర్పించారు.అదే రాత్రి అమ్మవారి ఆలయం వద్ద ఒగ్గు కథ నిర్వహించారు. ఈ కోటమ్మ జాతర ఉత్సవాలు రెండవ రోజు బుధవారం రోజు బండ్ల ఊరేగింపు గావు కార్యక్రమం ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఈ జాతర ఉత్సవాలకు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని గ్రామస్తులు పేర్కొన్నారు.