- రాష్ట్ర వాల్మీకి సంఘం కార్యదర్శి గాజులపల్లె జయరాం
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 08, మహానంది:
మహానంది మండల ప్రజలకు రాష్ట్ర వాల్మీకి సంఘం కార్యదర్శి గాజుల పల్లె జయరాం ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నేటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని అభిలషించారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర వాల్మీకి సంఘం కార్యదర్శి గాజులపల్లె జయరాం పిలుపునిచ్చారు.