-ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 08, మహానంది:
మహానంది దేవస్థానంలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి నూతన సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని 29 లక్షల 18 వేల 1 8 6 రూపాయల పెండింగ్ పాత బకాయిలు విడుదల చేసినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి సోమవారం పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 01/07/2019 నుండి 30/06/2022 సంవత్సరం వరకు ఉన్న, డి ఎ అరియర్స్ ( కరువు బత్యం) విడుదల చేసినట్లు తెలిపారు. ఆలయ ఉద్యోగులు గత కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ పాత బకాయిలకు సంబంధించి, గతంలో కూడా ఆలయ ఉద్యోగులకు తాను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత లక్షల రూపాయల్లో చెల్లించామని ఈవో గుర్తు చేశారు.