ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల విధుల నిర్లక్ష్యం..
డాక్టర్లు అంటే దేవుడితో సమానం అంటారు..
అలాంటి డాక్టర్లే నిర్లక్ష్యం వహిస్తే ఎలా…
మానవత్వం మరిచి, విధుల నిర్వహణ సక్రమంగా చేయకపోతే ప్రశ్నించొద్ద…
ప్రమాదవశాత్తు గాయపడిన వారికి కనీసం ప్రథమ చికిత్స చేయడానికి కూడా ములుగు ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో డాక్టర్లు కరువయ్యారు…
డాక్టర్లు లేరని సూపరింటెండెంట్ జగదీష్ గారికి కాల్ చేస్తే ఫోన్ ఎత్తే ఓపిక ఉండదు…
ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే ప్రాణాలు తీస్తుంటే ఎలా…
ప్రశ్నిస్తే నేరమా? వైద్య వృత్తి అంటేనే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలి…
ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి…
అలాంటి డాక్టర్లే నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు…
ఇది గత బి.ఆర్.ఎస్. ప్రభుత్వంలో లాగా దొరల ప్రభుత్వం కాదు…
ఇది ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, విధి నిర్వహణ సరిగ్గా చేయకపోతే ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం…
వ్యక్తిగతంగా ప్రైవేట్ వైద్యశాలలు పెట్టుకుని డబ్బుల కోసం ప్రభుత్వ డాక్టర్ వృత్తిని నిర్లక్ష్యం చేస్తున్నారు…
ప్రశ్నిస్తే సామాజిక మాధ్యమాల్లో పెట్టీ ప్రతిపక్ష నేతలతో కలిసి డ్రామాలాడుతున్నారు…
కూలీ పనికి వచ్చి బ్రతికే రవీందర్ అనే వ్యక్తికి ప్రమాదం జరిగితే పట్టించుకోని ప్రభుత్వ డాక్టర్లు…
పదహారు సార్లు ఫోన్ చేసిన ఎత్తని సూపరింటెండెంట్ జగదీష్ గారు…
అదే మన ఇంట్లో వాళ్ళకి జరిగితే మనం కూడా ప్రాణం పోయిన పర్లేదు కానీ ప్రభుత్వ డాక్టర్లను ప్రశ్నించకుండా వదిలేద్దామా?
ప్రజలు ఆలోచించాలి సరైన వైద్యం అందించాల్సిన వైద్యులు డబ్బుల సంపాదనలో పడి ప్రైవేట్ ఆసుపత్రులు పెట్టుకుంటు పోతే నిరుపేద రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు భరించగలరా…
ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తేనే ఎత్తని ములుగు జిల్లా వైద్య బృందం రేపు సామాన్యుడి ఫోన్స్ ఎత్తుతార…
ఒకసారి ఆలోచించండి, ఇది రాజకీయ కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచించండి…
ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స చేయడానికి డాక్టర్ కూడా లేని పరిస్థితిలో, జగదీష్ గారికి కాల్ చేయాల్సి వచ్చింది, అతని దగ్గరి నుండి వచ్చిన నిర్లక్ష్యపు సమాధానమే రవిచందర్ గారి ఆవేశానికి కారణం అని గ్రహించాలి…
అంతేకానీ అతను తిట్టడానికి అక్రమ ఆస్తులు గురించి, అత్యాశ గురించి కాదు, ఒక వ్యక్తి యొక్క ప్రథమ చికిత్స గురించి మాత్రమే అని తెలుసుకోవాలి…
డాక్టర్ల యొక్క నిర్లక్ష్య పోకడలకు చరమగీతం పాడాలి, బాధ్యతలు మరియు మానవత్వాన్ని మరిచిన డాక్టర్లు విదుల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు వంగ రవి యాదవ్ గారు…
తేదీ: 08.04.2024 సోమవారం అనగా ఈరోజున ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుల ముఖ్య సమావేశం ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ములుగు జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్ గారు విచ్చేసి డాక్టర్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తే కావాలని ప్రతిపక్ష నేతలు దాన్ని రాజకీయం చేస్తున్నారని, వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ల బృందం సరైన సమయానికి సక్రమంగా విధులు నిర్వర్తించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రవి యాదవ్ గారు మాట్లాడుతూ జీవంతరావుపల్లి గ్రామానికి కూలీ పని చేసుకోవడానికి వచ్చిన రవీందర్ అను వ్యక్తి అనుకోకుండా ప్రమాదానికి గురి అవగా వెంటనే ములుగు జిల్లా ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించగా వైద్యశాల యందు ప్రథమ చికిత్స చేయడానికి కనీసం ఒక్క డాక్టర్ కూడా లేకపోవడంతో వెంటనే కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రవిచందర్ గారు వైద్యశాల యొక్క సుపరిండెంట్ జగదీష్ గారికి ఫోన్ చేసి ప్రస్తుతం విధులు నిర్వహించే డాక్టర్ ఎవరని అడుగుదామని అనుకొగ అతను కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా ఆలస్యం చేశారని, అలాగే పదహారు సార్లు చేసిన ఫోన్ ఎత్తని జగదీష్ గారి పదిహేడవ సారి ఫోన్ ఎత్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రవిచందర్ గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రవీందర్ గారి గురించి బాధ పడుతూ ఆవేశ పడి మాట్లాడాడే తప్ప మరొక ఉద్దేశం లేదని అన్నారు. ఇరవై నాలుగు గంటలు వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో అసలు డాక్టర్లు సమయానికి ఎందుకు ఉండట్లే అని ప్రశ్నిస్తే అతను కావాలని రవి చందర్ గారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, మొదట జరిగిన వాదనను కట్ చేసి తిట్టిన మాటలను సామాజిక మాధ్యమాల్లో పెట్టీ ప్రతిపక్ష నేతలతో కలిసి రాజకీయం చేశాడు అని ఆరోపించారు. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే నిర్లక్ష్యం వహిస్తే ఎలా? చికిత్స చేయాల్సిన డాక్టర్లే సమయానికి లేక చికిత్స అందక జరుగుతున్న మరణాలు ఆపాలని కోరారు. గత బి.ఆర్.ఎస్. దొరల ప్రభుత్వంలో అలవాటు పడ్డ డాక్టర్ల సోమరితనం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అలానే ప్రవర్తిస్తున్నారని, ఈ విషయం మంత్రి సీతక్క గారి దృష్టికి తిసుకుపోతే ఇరవై నాలుగు గంటలు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని హెచ్చరించారు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఓర్చుకొలేని వైద్య సిబ్బంది కావాలని అలసత్వం ప్రదర్శిస్తున్నారు. డాక్టర్లు ప్రత్యక్ష దేవుళ్ళు అని కొలిచే ఈ సమాజంలో ఇలాంటి వారి వల్ల నిజమైన డాక్టర్లకు కూడా చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఇకనైనా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పల్లె జైపాల్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముసినపల్లి కుమార్ గౌడ్, జిల్లా కార్యదర్శి యాసం రవికుమార్, మండల బీసీ సెల్ అధ్యక్షులు పౌడాల ఓం ప్రకాష్, మండల బీసీ సెల్ ఉపాధ్యక్షులు బొంతల వేణు యాదవ్, సురేష్ కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.