Reporter -Silver Rajesh Medak.
తేదీ.08.4.2024.
కలెక్టర్ ఆధ్వర్యంలో టీమ్ వర్క్ గా పనిచేసి మెదక్ జిల్లాలో తాగునీటి సమస్యను ఎదుర్కొనడానికి ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి / డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ భారతి హోలికేరి, అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశపు హాలులో వేసవిలో మంచినీటి సరఫరాపై మిషన్ భగీరథ, ఇంట్రా, విద్యుత్, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలు, ఎంపీఓలు తదితరులతో త్రాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తాగునీటి సరఫరా ప్రత్యేక అధికారి భారతి హోలీ కేరి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్ తో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి పూర్తి అయ్యే వరకు పక్కా ప్రణాళికతో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర స్థాయి అధికారులను జిల్లాలకు నియమించిందని, దీన్ని బట్టి త్రాగునీటికి ఎంత ప్రాధాన్యత నిస్తుందో మనందరం గమనించాలని అన్నారు.ప్రభుత్వం త్రాగునీటి సరఫరా పర్యవేక్షణకై జిల్లా యంత్రాంగం పకడ్బందీ కార్యాచరణతో త్రాగునీటి సరఫరాపై ముందుకు వెళుతున్నదని, ఎక్కడెక్కడ సమస్యలు వస్తున్నాయో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో వెంటనే పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారని అన్నారు.
రానున్న రెండు నెలలు మంచినీటి సరఫరాకు అత్యంత కీలకమని నిరంతర పర్యవేక్షణతో మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లా స్థాయి అధికారి నుండి గ్రామ స్థాయి సిబ్బంది వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. ప్రత్యేక అధికారులు గ్రామపంచాయతీ సెక్రటరీలు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకుని తాగునీటి సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టి సమస్యను నివృత్తి చేసే విధంగా పనిచేయాలన్నారు.
మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ప్రత్యేక అధికారులు లతో మమేకమై తాగునీటి సమస్య ఎక్కడైనా ఉన్నదా తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలపై ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని చెప్పారు తాగునీటిపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని కంట్రోల్ రూమ్ కి వచ్చిన ఫిర్యాదులపై వేగంగా పరిష్కరించాలన్నారు. ఎల్లంపల్లి వాటర్ సప్లై అవుతున్న మండలాలైన తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగ్ మెయిన్ సోర్సులలో తాగునీటి ఇబ్బంది ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా లోకల్ బోర్వెల్స్ వ్యవసాయ ఆధారిత బోర్వెల్స్ వాటి ద్వారా సమస్యను నివృత్తి చేసుకోవాలన్నారు.
తాగునీటి ఇబ్బందులు వస్తే సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందుతుందని ఇబ్బందులు ఉన్న దగ్గర లోకల్ బోర్వెల్స్ ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
బోర్లు, చేతి పంపులు, అవసరమైన చోట వ్యవసాయ బావుల ద్వారా తాగునీటిని అందిస్తున్నట్లు . త్రాగునీటి సరఫరాను ప్రతి రోజు పర్యవేక్షిస్తున్నామని అవసరమైన మేర సిబ్బందిని నియమించామని, భూగర్భ జలాల నీటి స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని జిల్లాలో అవసరమున్న వారికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు. ప్రతి రోజు నీటి సరఫరాపై ప్రజల స్పందన తెలుసుకుంతున్నామని, ఎక్కడైనా సమస్య వస్తే కంట్రోల్ రూముకు ఫోన్ చేస్తే తక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ప్రతి మండలంలో మండల ప్రత్యేక అధికారి, ఎంపిడివో, ఎంపిఓ,.మిషన్ భగీరథ ఇంజినీర్లు ర్యాన్ ఢంగా గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తూ ప్రజల నుండి స్పందన తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో మెదక్, జిల్లా పరిధిలో వివిధ మండలాలు, తాగునీటి సరఫరాకు తీసుకుంటున్న చర్యలపై ఆయా మండలాల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఆర్. డబ్ల్యూ. ఎస్ ఈ. ఈ కమలాకర్ , మండలా అభివృద్ధి అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, గ్రామీణ నీటి సరఫరా, మిషన్ భగీరథ, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.