Venkatramulu Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.రామాయంపేట పట్టణానికి చెందిన మహేందర్ అను వ్యక్తి మరియు తన వద్ద పని చేస్తున్న షేక్ సర్దార్ అను వ్యక్తి యొక్క సహకారంతో రామాయంపేట పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ప్రజల వద్ద నుండి తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ పరిసర ప్రాంతాల్లో గల పౌల్ట్రీ ఫామ్ కి తరలిస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. ఇట్టి విషయం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా గురువారం రాత్రి 12 గంటల సమయంలో 16 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఏపీ 28 వై 0145 నెంబర్ గల లారీని కామారెడ్డి రోడ్డులో ఉన్న మెహర్ సాయి ఫంక్షన్ హాల్ సమీపంలో రామాయంపేట పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రామాయంపేట ఎస్సై రంజిత్ కుమార్ శుక్రవారం స్థానిక విలేకర్లకు తెలిపారు.