నంద్యాల జిల్లాలో చెక్ పోస్ట్ లలో ,విజిబుల్ పోలిసింగ్ లో ముమ్మర తనిఖీలు….
అక్రమంగా తరలిస్తున్న 91,00,000 నగదు స్వాదీనం….
నిస్పక్షపాతంగ ఎన్నికలు జరిగేలా శక్తి వంచన లేకుండా పనిచేయాలి…
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే పోలీసుల లక్ష్యం….
-ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 04, నంద్యాల:
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున నంద్యాల జిల్లా ఎస్పీ K.రఘువీర్ రెడ్డి ఆదేశాలమేరకు నంద్యాల జిల్లాలోని అన్నీ చెక్ పోస్ట్ లలో,విజిబుల్ పోలిసింగ్ లో జిల్లా పోలీసు అదికారులు మరియు సాయుద కేంద్ర బలగాలతో నిరంతరం ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.అంతే కాకుండా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసు అదికారులు వారి సిబ్బందిచే ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహిస్తున్నరు.ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున నంద్యాల జిల్లా డోన్ DSP వై.శ్రీనివాస రెడ్డి సూచనలతో బనగానపల్లె మండలం పసుపుల గ్రామం వద్ద తెల్లవారుజామున 3 గంటల సమయంలో డ్రైవరు సయ్యద్.మహబూబ్ బాష బెంగుళూరు నుండి లారీని తీసుకొని వస్తుండగా CI బనగానపల్లె వారి ఆధ్వర్యంలో FST టీమ్ మరియు సిబ్బందితో కలిసి తనిఖీచెయ్యగా ఒక బాక్స్ నందు నగదును గుర్తించడం జరిగింది.సదరు 91,00,000 నగదుకు సంబందించి సరియైన పత్రాలు చూపించనందున, ఎన్నికల నిభందనల ప్రకారం పంచనామా ద్వారా స్వాదినం చేసుకొని వాటిని సంబందిత అదికారులకు అప్పగించడం జరిగిందని తెలిపారు.