Venkatramulu, Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని మెదక్ చౌరస్తా వద్ద శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య క్షేత్రం నిర్వాహకులు సత్యనారాయణ ఆధ్వర్యంలో వేసవికాలం సందర్భంగా ప్రజల దాహార్తి తీర్చడం కోసం గురువారం నాడు చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు వేసవి తాపానికి తట్టుకోలేక వివిధ పనుల కోసం ఈ రహదారి గుండా వెళ్తున్న ప్రజలకు దాహార్తి తీర్చడానికి మరియు బస్టాండ్ లో ఈ చలివేంద్రం కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ, వేద పాఠశాల నిర్వాహకులు సంగమేశ్వర్, శాంతి కుమార్ అల్లాడి నారాయణ, సృజన్, వంజరి సత్యనారాయణ, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.