Reporter -Silver Rajesh Medak.
Date-03/04/2024.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొనే పి ఓ, ఏ పీ ఓ సిబ్బందికి శిక్షణ కోసం ఉద్దేశించిన కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం
క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గానికి సంబంధించి మెదక్ పట్టణంలోని తారకరామా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో పిఓ, ఏపీఓ శిక్షణ కేంద్రాలు
ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పోలింగ్ విధుల్లో పాల్గొనే పీఓ లు, ఏపీఓ లు,లకు పోలింగ్ విధులు, నిర్వహణపై ఎన్నికల నిబంధనల మేరకు పకడ్బందీగా శిక్షణ అందించాలని కలెక్టర్ సూచించారు.
మెదక్ నియోజకవర్గం సంబంధించి ప్రోసిడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రొసీడింగ్ అధికారులు మొత్తం-577 మంది, నర్సాపూర్ నియోజకవర్గానికి
సంబంధించి 464 పిఓ, ఏపీఓ శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 4, 6 వ తేదీల్లో పీఓ లు, ఏపీఓ లకు ఉదయం నుండి సాయంత్రం వరకు, శిక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు
. శిక్షణ కేంద్రాలకు వచ్చే సిబ్బందికి భోజన సదుపాయం, త్రాగునీటి సదుపాయం కల్పించాలని, కేంద్రాల్లో హెల్త్ క్యాంపులు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
క్షేత్ర పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట కలెక్టర్,ఆర్డీవో రమాదేవి,తాసిల్దార్ శ్రీనివాస్ డిఎస్ఓ రాజిరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్, రామాయంపేట తాసిల్దార్
రజని కుమారి తదితరులు పాల్గొన్నారు.