బస్ భవన్ లో ఏఎస్‌ఆర్టీయూ స్టాండింగ్ కమిటీ సమావేశం.
బస్ భవన్ లో మంగళవారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్‌ఆధ్వర్యంలో 210వ ప్రైస్ రివిజన్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఏఎస్‌ఆర్టీయూ స్టాండింగ్ కమిటీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 18 రాష్ట్రాల ఆర్టీసీలకు చెందిన ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.బస్సుల విడిభాగాల ధరల నిర్ణయం, కొనుగోలు పాలసీ, కొత్త వెండర్ల నియామకం, తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. బస్సుల విడిభాగాలకు చెందిన 15 గ్రూప్‌లకు సంబంధించిన ధరలను నిర్థారించారు.ఈ సందర్బంగా ఏఎస్‌ఆర్టీయూ స్టాండింగ్ కమిటీ చైర్మన్, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ.. ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తించి ఆర్టీసీల పరిరక్షణ కోసం ఏఎస్‌ఆర్టీయూ కృషి చేస్తుండటం అభినందనీయమన్నారు.