రామాయంపేట ఎస్సై రంజిత్ కుమార్
Venkatramulu, Ramayampet Reporter
సోషల్ మీడియాలో ఫేక్ ఐపిఎల్ టిక్కెట్లు..తస్మాత్ జాగ్రత్త అంటూ.. సైబర్ నెరగాళ్లు క్రికెట్ అభిమానులను కూడా వదలడం లేదు వారిపట్ల యువత అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా పోలీసు యంత్రాంగం హెచ్చరిస్తుంది.ఈ సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట ఎస్సై రంజిత్ కుమార్ సోమవారం మాట్లాడుతూ ఆన్లైన్లో ఐపీఎల్ టికెట్స్ అన్ని క్లోజ్ అవ్వడంతో ఈమధ్య సైబర్ నేరగాళ్లు తమ వద్ద ఐపిఎల్ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని వివిధ సోషల్ మీడియా అకౌంట్లో పోస్టులు పెట్టి, డిస్కౌంట్ ఇస్తామని చెప్పి క్యూర్ కోడ్ లేదా లింకుల ద్వారా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అదే విదంగా డబ్బులు పంపిన తరువాత మిమ్మల్ని బ్లాక్ చేయడం జరుగుతుందని,అలాగే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని అదేవిధంగా అనుమానాస్పద క్యూర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లించి యువత మోసపోవద్దని పేర్కొన్నారు. ఎవరైనా ఆన్లైన్ టికెట్ల ద్వారా బాధితులు మోసపోయినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ 1930 కి కాల్ చేయాలని ఆయన యువతకు సూచించారు.