Venkatramulu, Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో లబ్ధిదారుల సమృద్ధి మోడీ గ్యారెంటీ కార్యక్రమాన్ని పట్టణ బిజెపి నాయకులు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్,జిల్లా బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులు వెలుముల రమేష్ ప్రచారాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ దేశంలోని పేదలు ,యువత ,రైతులు మహిళలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోడీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అందులో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులను కలిసి వచ్చే ఎన్నికల్లో బిజెపికి ఓటు వేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని తిరిగి భారత ప్రధానిగా మోడీ గెలిచేందుకు ప్రతి ఒక్కరు బిజెపి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని బిజెపి నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.