Venkatramulu, Ramayampet Reporter
మెదక్ జిల్లా నిజాంపేట మాజీ దళిత ఉపసర్పంచ్ తన భూమికి సంబంధించిన రోడ్డు విషయంలో వాగ్వాదం ఏర్పడి దాడి చేశారని ఉప సర్పంచ్ బాబు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం రామాయంపేట పట్టణంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పొట్టి శంకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి75 సంవత్సరాలు గడుస్తున్న దళితులపై ఇంకా దాడులు జరుగుతున్నాయన్నారు.దళితులపై ఇలాంటి దాలుడు జరగడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.ఉపసర్పంచ్ బాబుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసులు విచారణ పూర్తి చేసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్ మాదిగ,రామాయంపేట మండల అధ్యక్షుడు మద్దూరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.