నిత్యావసర సేవలందించే 33 విభాగాల వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు సదుపాయం
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 31, నంద్యాల:
సార్వత్రిక ఎన్నికలు -2024 కు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనే 33 నిత్యావసర సేవలు (Essential Services) అందించే శాఖలకు చెందిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తోందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వివిధ విభాగాల్లో విధుల్లో ఉంటూ పోలింగ్ రోజు ఓటు వేయలేని 33 శాఖలకు చెందిన వారికి అర్హులైన ఆయా విభాగాలకు చెందిన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.త్వరలో జిల్లాలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అర్హతవున్న విభాగాల వివరాలను వెల్లడించింది. ఇందు కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించడంతో పాటు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఫారం 12 డి లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఇందుకోసం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారిగా ఏపీఎంఐపీ పిడి శివ సత్యనారాయణ, సహాయ నోడల్ అధికారిగా డిపిఓ మంజులవాణిని నియమించడం జరిగిందన్నారు. సదరు నోడల్ అధికారులు సంబంధిత ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం గురించి తెలియజేస్తారన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించిన విభాగాలు….
- మెట్రో, 2. రైల్వే రవాణా (ప్రయాణికులు, సరుకు రవాణా) సేవలు, 3. పోలింగ్ రోజు కార్యకలాపాలను కవర్ చేయడానికి కమిషన్ ఆమోదంతో అధికార లేఖలు జారీ పొందిన మీడియా వ్యక్తులు, 4. విద్యుత్ శాఖ, 5. బీఎస్ఎన్ఎల్, 6. పోస్టల్ టెలిగ్రామ్, 7. దూరదర్శన్, 8. ఆలిండియా రేడియో, 9. రాష్ట్ర మిల్క్ యూనియన్, మిల్క్ కో.ఆపరేటివ్ సొసైటీలు,10. ఆరోగ్య శాఖ,11. ఫుడ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్,12. విమానయానం,13. రోడ్డు రవాణా సంస్థ,14. అగ్నిమాపక సేవలు,15. ట్రాఫిక్ పోలీస్,16. అంబులెన్స్ సేవలు,17. షిప్పింగ్,18. ఫైర్ ఫోర్స్,19. జైళ్లు, 20. ఎక్సైజ్ శాఖ, 21. వాటర్ ఆథారిటీ, 22. ట్రెజరీ సర్వీస్, 23. అటవీశాఖ, 24. సమాచార, ప్రజాసంబంధాల శాఖ, 25. పోలీసు, 26. పౌర రక్షణ- హోంగార్డులు, 27. ఆహార పౌర సరఫరాలు – వినియోగదారుల వ్యవహారాలు, 28. ఎనర్జీ (పవర్),29. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, 30. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, 31. డిపార్ట్మెంట్ ఆఫ్ పీడబ్ల్యూడి, 32. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్స్, 33. విపత్తు నిర్వహణ శాఖలకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.