Reporter -Silver Rajesh Medak.
తేదీ 31-3-2024 మెదక్
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా
—–జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున, ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు నిర్వహణలో భాగంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికముగా వాయిదా వేయడం జరిగిందని, ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించాలని జిల్లా కలెక్టర్ ప్రకటనలో తెలిపారు.