రామాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం

Venkatramulu, Ramayampet Reporter

మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మధుర గార్డెన్ లో మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీ దే అన్నారు.అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో ఆరు గ్యారంటీలు కూడా అమలు చేయలేదని రైతులకు రైతుబంధు కూడా దిక్కు లేదని తెలిపారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో మళ్లీ రాబోతుందని పేర్కొన్నారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ బిఅర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డి ని రాష్ట్రంలో కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు శేరి సుభాష్ రెడ్డి, కాంటారెడ్డి తిరుపతిరెడ్డి, పట్లోళ్ల శశిధర్ రెడ్డి,మండల నాయకులు గజవాడ నాగరాజు, మహేందర్ రెడ్డి,పల్లె జితేందర్ గౌడ్,సరాపు యాదగిరి, పార్టీ కౌన్సిలర్లు,పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!