Reporter -Silver Rajesh Medak.
తేదీ 30-3-2024, మెదక్.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి — జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కృష్ణమూర్తి , డి డబ్ల్యు అధికారి బ్రహ్మాజీ
స్థానిక మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక ప్రాంతంలో శనివారం జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కృష్ణమూర్తి, డి డబ్ల్యు ఓ బ్రహ్మాజీ ఆధ్వర్యంలో స్వీప్ మెదక్ జిల్లా వారి ఓటర్ అవగాహనలో భాగంగా ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఓటు హక్కు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుందని, ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు బ్రహ్మాస్త్రం అని దేశాన్ని మార్చే గొప్ప శక్తిని అన్నారు. డి డబ్ల్యు ఓ అధికారి బ్రహ్మాజీ మాట్లాడుతూ ఏప్రిల్ 15 ,2024 18 సంవత్సరాలు నిండిన యువకులు నూతన ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. అవకాశాన్ని జిల్లాలో ఉన్న యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక ప్రాంత ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.